● మురికికాలువలో పసికందు ● మొగిలిపాడులో ఘటన
కాశీబుగ్గ: పలాసలో కలకలం రేగింది. మురికికాలువలో ముక్కుపచ్చలారని పసికందు మృతదేహం కనిపించడంతో విషాదం అలముకుంది. పలాస శివారు మొగిలిపాడు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న జంక్షన్లో చికెన్ దుకాణం చెంత మురికి కాలువలో అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు తొలుత బొమ్మలా ఉందని భావించారు. దగ్గరికి వెళ్లిచూడగా పసికందు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.


