శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి మిస్సైల్ హీరోగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మహానుభావుడు మాజీ రాష్ట్రప్రతి అబ్దుల్ కలాం అని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం హైదరాబాద్ వచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకి స్వాగత సత్కారాలు చేయడంతో పాటు రోజంతా ఆయనతో ఉన్న అదృష్టం మరిచిపోలేనిదన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం టౌన్హాల్లో గురువారం అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎంఏ బేగ్ అధ్యక్షతన మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ రఫీ ఆధ్వర్యంలో ధర్మాన పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అబ్దుల్కలాంను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు అంధరవరపు సూరిబాబు అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మైనార్టీ మత పెద్దలు హాజీ షాన్వాజ్, ముజీబుర్ రెహ్మాన్, సలీం సాబ్, ఎంఏ బాషా, సుకుర్ ఖాన్, ఎస్ఏ బేగ్, సర్ఫరాజ్ భ య్యా, వైఎస్సార్సీపీ నాయకులు మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయరావు, రౌతు శంకరరావు, పొన్నాడ రుషి, బుక్కురు ఉమామహేశ్వరరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్, కోట గోవిందరావు, గుజ్జల శాంతేశ్వరరావు, పీస గోపి, తంగుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


