రణస్థలం: రసాయనిక ఔషధ తయారీ పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ ఎస్.శరవణ్ ఆదేశించారు. విశాఖప ట్నం జోనల్ కార్యాలయ జోనల్ సీనియర్ కాలుష్య నియంత్రణ ఇంజనీర్లు ఎస్ఈఈ టి.సుదర్శన్, ఎ. రామారావు నాయుడు, ఈఈ పి.శ్రీనివాసరావు, సీనియర్ సైంటిస్ట్ వీరేంద్రకుమార్ల బృంద సభ్యు లు పైడిభీమవరంలోని ఆరోయాక్టివ్ ఫార్మా యూనిట్–4, డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమలను పరిశీలించారు. ముఖ్యంగా ఆరోయాక్టివ్ ఫార్మా ప్రైవేటు లిమిటెడ్ వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ పనితీరును, పరిశ్రమ నుంచి శుద్ధి చేసిన నీటిని సముద్రంలోకి విడిచిపెట్టే మైరన్ పైపుల పంపింగ్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్ను సందర్శించి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ పనితీరును నిశితంగా పరిశీలించారు. కార్యక్రమంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణ అధికారి ఈఈ బి.కరుణశ్రీ, అసిస్టెంట్ ఏఈఈఈ వి.వంశీ పాల్గొన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జైళ్లల్లో సుదీర్ఘకాలంగా మగ్గుతున్న అర్హులైన విచారణ ఖైదీలకు చట్టప్రకారం త్వరితగతిన బెయిల్ మంజూరయ్యేలా చూడటంతో పాటు నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో అధికారులు సమర్థంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సునీత కొండబోలు ఆదేశించారు. జిల్లా కోర్టు సముదాయంలో గురువారం అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, జిల్లా జైలు సూపరింటెండెంట్ జి.మధుబాబు, ప్రాసి క్యూషన్ డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, తదితరులు పాల్గొన్నారు.


