ఆమె నేత్రాలు సజీవం | - | Sakshi
Sakshi News home page

ఆమె నేత్రాలు సజీవం

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

శ్రీకాకుళం కల్చరల్‌: ఆమదాలవలసకు చెందిన నారా ఇందులక్ష్మి (62) మృతి చెందడంతో ఆమె నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సమన్వయంతో మగటపల్లి కళ్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, బి.మనుకుమార్‌లు కార్నియాలను సేకరించి ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యులకు జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement