పంచాయతీ.. ఎన్నికలకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ.. ఎన్నికలకు సన్నద్ధం

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

● మూడు విడతల్లో పోలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల ● డివిజన్ల వారీగా నిర్వహించేలా ఉత్తర్వుల జారీ రెండో విడత మూడో విడత

మొదటి విడత

● మూడు విడతల్లో పోలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల ● డివిజన్ల వారీగా నిర్వహించేలా ఉత్తర్వుల జారీ

అరసవల్లి:

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న 910 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలి విడతగా నవంబర్‌ 26న 8 మండలాల్లో 232 గ్రామ పంచాయతీలకు 2262 పోలింగ్‌ స్టేషన్లలో, రెండో విడతగా నవంబర్‌ 29న 11 మండలాల్లో 347 పంచాయతీలకు 3248 పోలింగ్‌ స్టేషన్లలో, మూడో విడతగా డిసెంబర్‌ 2న మిగిలిన 11 మండలాల్లో 331 గ్రామ పంచాయతీలకు 3254 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి ఆధ్వర్యంలో పోలింగ్‌ చర్యలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మంగళ, బుధవారాల్లో పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. బుధవారం కలెక్టర్‌ రిజర్వేషన్‌ ప్రక్రియపై గెజిట్‌ విడుదల చేశారు.

మొత్తం పంచాయతీలు 347

శ్రీకాకుళం 23

గార 25

నరసన్నపేట 34

పోలాకి 31

సారవకోట 35

జలుమూరు 40

ఎల్‌ఎన్‌ పేట 22

కొత్తూరు 43

మెళియాపుట్టి 37

హిరమండలం 23

పాతపట్నం 34

మొత్తం పంచాయతీలు 331

టెక్కలి 27

కోటబొమ్మాళి 38

సంతబొమ్మాళి 34

నందిగాం 37

పలాస 19

మందస 41

వజ్రపుకొత్తూరు 37

ఇచ్ఛాపురం 21

కంచిలి 31

కవిటి 23

సోంపేట 23

మొత్తం పంచాయతీలు 232

ఎచ్చెర్ల 26

జి.సిగడాం 31

లావేరు 31

రణస్థలం 34

ఆమదాలవలస 30

బూర్జ 30

పొందూరు 29

సరుబుజ్జిలి 21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement