శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం సబ్ డివిజన్కు రెండేళ్లుగా డీఎస్పీగా సేవలందించి ఇటీవలే శ్రీకాకుళం ప్రాంతీయ విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధికారి (ఆర్వీఅండ్ఈవో)గా నియమితులైన సీహెచ్ వివేకానంద అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా ఉద్యోగోన్నతి పొందారు. ఈ మేరకు మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏఎస్పీ వివేకానంద మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయానికి రిపోర్టింగ్ అవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతరం ఈయన శ్రీకాకుళం ఆర్వీఅండ్ఈవోగానే కొనసాగనున్నారు.


