ఆమదాలవలస మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఇవి కొలిక్కివచ్చాక రిజర్వేషన్ల తుది జాబితా వెల్లడిస్తారు.
ఆమదాలవలస మున్సిపాలిటీ 1987లో ఏర్పాటైంది. తొలి ఎన్నికల్లో జనరల్కు రిజర్వు అయింది. ఆ ఎన్నికల్లో బొడ్డేపల్లి సత్యవతి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఆ ఎన్నికల్లో తమ్మినేని గీత ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీకి ఇదే చివరి ఎన్నిక. వివిధ కారణాల రీత్యా చాలా సార్లు ఎన్నికలు జరగలేదు. తాజాగా జరగనున్న ఎన్నికలకు జనరల్ మహిళ రిజర్వేషన్ ఖరారైంది.


