సంబరాల జాతర! | - | Sakshi
Sakshi News home page

సంబరాల జాతర!

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

ఆడపడుచుల కోసం..

దసరా

ముందర..

ఇచ్ఛాపురం రూరల్‌: దసరాకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో అప్పుడే పండుగ సందడి మొదలైపోయింది. దేశమంతా విజయదశమి కోసం ఎదురుచూస్తుంటే..ఈ సరిహద్దు పల్లెల్లో మాత్రం సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ మందస్తూ దసరా సంబరాలు జరుపుకోవడం విశేషం. ‘దొంగ దసరా’ పేరుతో పిలిచే ఈ వేడుకలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ప్రాంతీయ సంస్కృతి, కుటుంబ అనుబంధాలు, పెద్దలు ఏర్పాటు చేసిన ఆచారాలకు ఈ పండుగ అద్దం పడుతోంది.

రెండు సందర్భాల్లో వేడుకలు..

పోలాల అమావాస్య తర్వాత వచ్చే మంగళవారం, సాధారణ దసరా పండుగ ముగిసిన తర్వాత వచ్చే మంగళవారం ఈ వేడుకలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. గ్రామాల్లో తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ప్రకారం ఆయా సందర్భాల్లో గ్రామస్తులు కుటుంబ సమేతంగా పండుగ జరుపుకుంటారు.

కొత్త వస్త్రాలు..సంబరాలు..

దొంగ దసరా సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి వేడుకలు జరుపుకుంటారు. స్థానిక ఆచారాల ప్రకారం కోళ్లు, మేకలు సమర్పిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. దసరా పండుగకు ఆదనంగా మరోసారి అందరూ కలసి ఆనందంగా గడపడం ఈ వేడుకల ప్రత్యేకత.

తరతరాలుగా...

కాలం మారుతున్నా సరిహద్దు గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 13న మండపల్లి, బుడ్డేపుపేట, భవానీపురం, ఎం.తోటూరు, దేవులమద్రి, లక్ష్మీపురం, మునిభద్ర గ్రామాల్లో ముందస్తు దసరా వేడుకలు జరుపతగా, అక్టోబర్‌ 27న రత్తకన్న, లొద్దపుట్టి, అయ్యవారిపేట, జగన్నాథపురం గ్రామాల్లో దసరా వేడుకలు జరుపుకుంటారు. ఈ వేడుకలు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తూ, గ్రామీణ సంస్కృతిని కాపాడుతున్న ‘దొంగ దసరా’ వేడుకలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతున్నాయి.

పెళ్లయిన ఆడపడులు దసరా సందర్భంగా పుట్టింటికి వెళ్లడం, కోడల్లు తమ కన్నవారి ఇంటికి వెళ్లడం సాధారణంగా జరిగే విషయమే. ఇదే సమయంలో అత్తవారింట్లోనూ పండుగ ఉండటంతో కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరడం కష్టమవుతోంది. దీంతో ఆడపడుచులు, కోడళ్లు లేని ఇళ్లు బోసిపోయినట్లవుతాయని గ్రామ పెద్దలు భావించారు. అందరూ కలిసి పండుగ చేసుకునేలా దసరాకు ముందు లేదా తర్వాత మరో మంగళవారం వేడుకలు నిర్వహించే సంప్రదాయం ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకంగా ‘దొంగ దసరా’

తరతరాలుగా కొనసాగుతున్న వినూత్న ఆచారం

అమ్మవారికి బోనాలు, మొక్కుబడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement