కి‘లేడీ’ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కి‘లేడీ’ అరెస్టు

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

పోటీల విజేతలు

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈనెల 8వ తేదీన వృద్ధురాలి మెడలో చైన్‌ స్నాచింగ్‌ చేసిన మహిళను రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహిళ వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువైన 38.0 గ్రాముల బంగారు గొలును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధురాలు యడ్ల వరలక్ష్మి గోవిందనగర్‌లో ఒంటరిగా నివాసముంటోంది. దీంతో ఇల్లు అద్దెకు కావాలంటూ ముందస్తు ప్లాన్‌ ప్రకారం ఇందిరానగర్‌ కాలనీలో నివాసముంటున్న రౌతు నీరజ అలియాస్‌ సుష్మ ఆమె వద్దకు వెళ్లింది. సుష్మ స్వస్థలం విజయనగరంలో జిల్లాలోని రాజాం మండలంలో కంచరాం గ్రామం. మూడు రోజులు ముందుగా రెక్కి నిర్వహించి ఇల్లు కావాలంటూ వృద్ధురాలిని పరిచయం చేసుకుంది. అనంతరం 8వ తేదీన ఇంట్లోకి చొరబడి వృద్ధురాలితో మాటలు కలిపి కంట్లో కారం కొట్టి బలవంతంగా వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిపోయింది.

సీసీ ఫుటేజీ ఆధారంగా...

రూరల్‌ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా జల్లెడపట్టారు. దొంగతనం చేసిన సమయం నుంచి ఎలా వెళ్లిది, ఎక్కడ ఆగింది అన్న విషయాలను పిన్‌ టు పిన్‌ కూపీ లాగారు. దీంతో ఆమె ఆనవాళ్లు ఇందిరానగర్‌ కాలనీలోనే చూపించాయి. రూరల్‌ ఎస్‌ఐ సిబ్బందితో కలిసి సోమవారం ఆమెను ఇందిరానగర్‌ కాలనీ పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్దనున్న బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రూరల్‌ పోలీసుల పనితీరును ఎస్పీ మహేశ్వరరెడ్డి, డీఎస్సీ ధనుజంయ నాయుడు, టౌన్‌ సీఐ పైడపునాయుడు అభినందనలు తెలిపారు.

ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా మల్లేశ్వరరావు

శ్రీకాకుళం అర్బన్‌: ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌(ఐఎన్‌టీయూసీ)జిల్లా అధ్యక్షుడిగా ఎం.మల్లేశ్వరరావు నియామకమయ్యారని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన భవన్‌లో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షునిగా మల్లేశ్వరరావు పదవీ స్వీకారం జరిగింది. ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా మల్లేశ్వరరావు నియామకాన్ని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి ధ్రువీకరించారని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు దేశెల్ల గోవింద మల్లిబాబు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌, కాంగ్రెస్‌ నాయకులు ఇజ్జురోతు రమణ, పిన్నింటి పారం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణిస్తే గుర్తింపు

నూజివీడు: క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌డీ స్పోర్ట్స్‌ అండ్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించిన అండర్‌–16 బాలబాలికల ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ కబడ్డీ పోటీలు నూజివీడులో ముగిశాయి. ఈ పోటీల విజేతలకు నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నూజివీడులో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని ఆయన కొనియాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులకు ఏ క్రీడపై ఆసక్తి ఉందో కోచ్‌లు, పీడీ, పీఈటీలు గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్‌.రామదాసు, కబడ్డీ అసోసియేషన్‌ నాయకులు, నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

బాలికల విభాగం: శ్రీకాకుళం (ప్రథమ స్థానం), కర్నూలు (ద్వితీయ స్థానం), చిత్తూరు (తృతీయ స్థానం)

బాలుర విభాగం: బాపట్ల (ప్రథమ స్థానం), నెల్లూరు (ద్వితీయ స్థానం), తిరుపతి (తృతీయ స్థానం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement