బీసీల కోసం మాట్లాడే అర్హత టీడీపీకి లేదు | - | Sakshi
Sakshi News home page

బీసీల కోసం మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

● ఎమ్మెల్సీ నర్తు రామారావు

కంచిలి: బీసీల అభ్యున్నతి కోసం మాట్లాడే అర్హత టీడీపీకి లేదని జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. కంచిలిలోని ఆయన కార్యాలయంలో స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటినుంచి బీసీలను అవసరానికి వాడుకోవడం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే బీసీలకు మేలు జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో తెలిపేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు బీసీ నాయకులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని తెలిపారు. అలాగే ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి మూడు కార్పొరేషన్‌ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, ఇక్కడి నుంచి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, డీసీఎంఎస్‌ ఇలా ఎన్నో పదవులను కేటాయించారన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన యాదవులకు గతంలో కాంగ్రెస్‌, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ జిల్లాలో గుర్తించిందని గుర్తు చేశారు. సమావేశంలో బీసీ నాయకుడు, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు కొల్లి ఈశ్వరరావు, కంచమ్మ తల్లి కమిటీ చైర్మన్‌ వంజరాన కేశవరావు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు గుమ్మడి రామదాసు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొండాడ వైకుంఠరావు, దుబ్బ లోకనాథం, డొక్కరి దాలయ్య, మట్ట తేజం, కుణితి తిరుపతిరావు, రామారావు, దుబ్బ జనార్ధన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement