బాహుదాపై వంతెన నిర్మించేదెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

బాహుదాపై వంతెన నిర్మించేదెప్పుడు?

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

ఇచ్ఛాపురం: బాహుదానదిపై కొత్త వంతెన నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని వైఎస్సార్‌ సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొత్తవంతెన నిర్మాణం కోరుతూ ఆదివారం పార్టీ నాయకులతో కలిసి బ్రిడ్జిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన ఇచ్ఛాపురం పట్టణానికి చుట్టపక్కల గ్రామాలను అనుసంధానం చేసే బ్రిడ్జి 2023 మే 3న కూలిపోయిందన్నారు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొద్దిరోజుల వ్యవధిలోనే రూ.40లక్షలు కేటాయించి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసిందని, అక్కడికి కేవలం మూడు నెలల వ్యవధిలో నూతన వంతెన నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. వంతెన నిర్మాణానికి అవసరమైన సాయిల్‌ టెస్ట్‌లు కూడా పూర్తిచేశారని తెలిపారు. కూలిన బ్రిడ్జిని పరిశీలించిన అప్పటి ఎమ్మెల్యే అశోక్‌బాబు,ఎంపీ రామ్మోహన్‌న్నాయుడు తామ అధికారంలోనికి వచ్చిన ఆరునెలల్లోనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా వంతెన నిర్మాణ పనులను రద్దు చేసిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు వస్తున్నందన ప్రజలను మభ్యపెట్టడానికే రూ..19 కోట్లు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారని, అవి ఏ పనులకు కేటాయించారో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పైల దేవదాస్‌రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉలాల భారతిదివ్య, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, ఎంపీపీ బోరపుష్ప, పట్టణ, మండల అధ్యక్షుడు ప్రకాషరావు పట్నాయక్‌, ఆశి కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ప్రత్తి అన్వేష్‌, పిలక యాదవరెడ్డి, ఉలాల కోదండరామ్‌, చాట్ల తులసీదాస్‌రెడ్డి, కారింగి మోహన్‌రావు, పిలక దేవరాజ్‌, సాలిన గాంధీ, కాళ్ల సత్యం, సుగ్గు ప్రేమ్‌కుమార్‌, సాడి దుర్యోధనరెడ్డి, సీహెచ్‌ తిరుపతి, సీహెచ్‌ లోహిదాస్‌, పి.తేజ, కాళ్ల మదన్‌, ఎండీ షఫీ, రెయ్యి నారాయణ, ధర్మతేజ, వంశీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement