కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళన విరమణ | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళన విరమణ

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

శ్రీకాకుళం: జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 6 నుంచి విధులను బహిష్కరించి ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సైతం ధర్నా నిర్వహించిన వారు ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నామని వైద్య ఆరోగ్య కాంట్రాక్ట్‌ ఉద్యోగ జేఏసీ నాయకులు వేదవతి, లక్ష్మీబాయి, అశోక్‌, వెంకటరమణ విలేకరులకు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం తమకు తెలియకుండా, చర్చించకుండా సమ్మె విరమణపై సంతకాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడి ఎన్నికల కోడ్‌ త్వరలో అమలు కానున్న దృష్ట్యా జిల్లా నాయకత్వాలు సైతం ఆందోళనను తాత్కాలికంగా విరమించాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. ఎన్నికలు పూర్తయి కోడ్‌ ముగిసిన తర్వాత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మళ్లీ ఇదే ఐక్యమత్యంతో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన ఎన్జీవో సంఘాలు, రెవెన్యూ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement