ప్రకృతి వినాశనానికి పాల్పడితే సహించం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వినాశనానికి పాల్పడితే సహించం

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

కంచిలి : ప్రకృతి వినాశనానికి పాల్పడితే సహించేది లేదని సీపీఐ సీనియర్‌ నాయకుడు చాపర సుందరలాల్‌ అన్నారు. నువాగడ గ్రామంలో హరిచంద్ర అధ్యక్షతన ప్రకృతి సంరక్షణ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరలాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు మొక్కలు నాటమని చెబుతూనే మరోవైపు కార్పొరేట్లకు మైనింగ్‌ కోసం అడవులను, కొండలను లీజుకు పర్మిషన్లు ఇవ్వడం దారుణమన్నారు.

స్థానికులను సంప్రదించకుండా కొండను తవ్వడానికి రావడం సరికాదన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలిన నారాయణస్వామి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొండలనే కాకుండా ఇక్కడి భూములపై కూడా రాజకీయ నాయకుల కన్ను పడిందన్నారు. గిరిజనులకు ఆధారమైన కొండలను తవ్వడం వల్ల ఉపరితల జలాలతోపాటు భూగర్భ జలాలు కూడా కలుషితమై నీరు దొరకని పరిస్థితులను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, మండల పార్టీ నేత అయినింటి లోకనాథం, స్థానికులు జైరాం, లిమ్మ, బొబ్బి, తొబిరో, ఈశ్వర్‌, గణేష్‌, నాలుగు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement