టెక్కలి రూరల్: అయోధ్యపురం పంచాయతీ కూర్మనాథపురం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు సుమారు 70 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. తెలుపు షర్టు, నీలం లుంగీ, తువ్వాలు ధరించి ఉన్నాడు. మృతుడు మోదుగవలసకు చెందిన సంపతిరావు జనార్దన రావు(70)గా పోలీసులు గుర్తించారు.
రిమ్స్‌లో రక్తదానం
శ్రీకాకుళం : అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా పయామ్ ఇ ఇన్సానియత్ ఫోరమ్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రిమ్స్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆల్ ఇండియా పయామ్ ఇ ఇన్సానియత్ ఫోరమ్ హైదరాబాద్ ప్రతినిధి జనాబ్ ముస్లిముద్దీన్, ఉత్తరాంధ్ర కన్వీనర్ జనాబ్ అబ్దుల్ కలామ్, శ్రీకాకుళం ప్రతినిధి జనాబ్ షేక్ సయీమ్, వైద్యాధికారులు డాక్టర్ ఎం.షామిల, డాక్టర్ ఎల్.పద్మప్రియ, డాక్టర్ పి.ప్రకాష్‌రావు పాల్గొన్నారు.


