ఆదిత్యుని సన్నిధిలో భక్తుల పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో భక్తుల పాట్లు

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

అరసవల్లి : ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పలు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచే భానుడి ప్రతాపం అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఉక్కబోతకు గురయ్యారు. మంచినీటిని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినప్పటికీ పరిశుభ్రత పాటించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తాకిడికి వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆలయం ముందు టెంట్లు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రసాదాల విక్రయాల విషయంలో కూడా ఆన్‌లైన్‌ సేవలు మొరాయించాయి. ఒక్కసారిగా విక్రయాల విభాగంపై ఒత్తిడి రావడంతో సిబ్బంది కూడా ఇబ్బందులు పడ్డారు.

బౌద్ధారామాల సందర్శన

గార: శాలిహుండంలోని బౌద్ధారామాలను కాశీబుగ్గ పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం సందర్శించారు. పర్యాటక ప్రాంతాల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చి శాలిహుండంలో బౌద్ధం వ్యాప్తి చెందిన విశేషాలను, అప్పటి కట్టడాలు, ఆరామాల చరిత్రను తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు వై.చిన్నంనాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గట్కా పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ

నరసన్నపేట: స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన గట్కా పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ చూపి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఏకంగా 23 మంది బాలబాలికలు బంగారు పతకాలు, ఒకరు రజత పతకం సాధించారు. దీంతో రాష్ట్ర స్థాయిలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కూడా జిల్లా జట్టుకు లభించిందని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతిరాణి తెలిపారు. స్థానిక గట్కా కోచ్‌ ఖగేశ్వరరావు ఆధ్వర్యంలో 32 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాల పంట

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో సిక్కోలు వెటరన్‌ అథ్లెట్స్‌ పతకాల పంట పండించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ వేదికగా శని, ఆదివారాల్లో జరిగిన 45వ ఆంధ్రప్రదేశ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో శ్రీకాకుళం మాస్టర్‌ అథ్లెట్స్‌ 35 పతకాలు సాధించి సత్తాచాటారు. ఇందులో 13 బంగారు, ఏడు రజత, మరో 15 కాంస్య పతకాలు ఉన్నాయి.

సత్తాచాటిన ఈశ్వరరావు

శ్రీకాకుళం న్యూకాలనీ : నగరానికి చెందిన స్టార్‌ వెటరన్‌ అథ్లెట్‌, లాంగ్‌ రేసర్‌ అన్నెపు ఈశ్వరరావు మరోసారి సత్తాచాటారు. తమిళనాడులోని కాల్మ్‌బటూర్‌ వేదికగా ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగిన 5వ జాతీయస్థాయి వెటరన్స్‌ స్పోర్ట్స్‌ గేమ్స్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో ఈ విశ్రాంత వార్డెన్‌ రెండు పతకాలతో మెరిశారు. 10కిలో మీటర్ల పరుగులో ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకం సాధించగా, 5 కిలోమీటర్ల నడకలో తృతీయస్థానంలో నిలిచి శభాష్‌ అనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement