ప్రతిభావంతులకు చేయూత | - | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకు చేయూత

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

ప్రతిభావంతులకు చేయూత ● నవంబర్‌లో ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతన పరీక్ష ● ఎంపికై తే ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్‌ ● దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి పరీక్షా విధానం ఇలా.. మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక..

సరుబుజ్జిలి:

విద్యార్థుల్లో ఎంతటి ప్రతిభ ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఎంతోమంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి ప్రతిభ గల పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పథకా న్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులకు బాటలు వేసుకుంటున్నారు.

ఈ పథకంలో ఎంపికై న విద్యార్థికి నాలుగు సంవత్సరాలు పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఉపకార వేతనం అందుతుంది. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ఏడాదికి రూ.12 వేలు చొప్పున నాలుగేళ్లపాటు రూ.48 వేల స్కాలర్‌షిప్‌ దక్కుతుంది. నవంబర్‌లో జరగనున్న ప్రవేశపరీక్షకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

ఈ ఏడాది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే పరీక్షకు అర్హులు. 7వ తరగతిలో 55 శా తం మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధించి ఉంటే పరీక్షకు అర్హులు. ప్రవేశ పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. రీజనింగ్‌, అర్థమెటిక్‌, గణితం, సోషల్‌, సైన్సుపై ప్రశ్నలు ఉంటా యి. జనరల్‌, బీసీ విద్యార్థులు 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 2008– 09 సంవత్సరం నుంచి నిరాటంకంగా పథకం అమ లవుతోంది. ప్రతి ఏటా 8వ తరగతి చదివిన విద్యార్థులకు నవంబర్‌లో ప్రవేశపరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తారు. గతంలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ఏడాదికి రూ.6వేలు వంతు న రూ.24 వేలు అందేవి. ప్రస్తుతం రూ.48వేలకు పెంచారు. దీంతో విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపికై న విద్యార్థులకు ఏటా నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తారు. ఈ ఏడాది నవంబర్‌ 15న జరిగే ప్రవేశ పరీక్షకు ఇప్పటికే విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement