చంద్రబాబు డ్రామా బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు డ్రామా బట్టబయలు

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

● ఎమ్మెల్సీ నర్తు రామారావు

ఇచ్ఛాపురం రూరల్‌: చంద్రబాబు ఓట్ల నాట కం మరోసారి బట్టబయలైందని ఎమ్మెల్సీ నర్తు రామారావు యాదవ్‌ మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయస్థానం నుంచి సానుకూల తీర్పు రాదని తెలిసినా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల నుంచి వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు నక్కకు నాకలోకానికీ ఉన్నంత వ్యత్యాసం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చట్టసభలు, స్థానిక సంస్థలతో పాటు నామినేటెడ్‌ పదువులు, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కేటాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జెడ్పీ చైర్మన్‌, మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లోనూ బీసీలకే పెద్దపీట వేశారన్నారు. ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ప్రతి సామాజిక వర్గానికి గుర్తింపునిచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై బీసీలు ప్రత్యక్ష పోరాటానికి దిగుతారని, తమ రాజకీయ చైతన్యాన్ని చూపేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement