● రైలు ఢీకొని 140 గొర్రెలు మృతి
కాశీబుగ్గ : రైలు పట్టాలపై మూగజీవాల మృత్యుఘోష వినిపించింది. పూండి–రౌతుపురం రైల్వే స్టేషన్, నందిగాం మండలం దేవాడ పరిధి రైలు పట్టాల కు ఆనుకుని ఉన్న పరిసరాల్లో 140 గొర్రెలను కొందరు పెంపకందారులు మేతకు తీసుకువచ్చారు. సా యంత్రం 4.30 గంటల సమయంలో ట్రాక్ పైనుంచి జీవాలను దాటిస్తుండగా విశాఖ వైపు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు వాటిపై నుంచి దూసుకెళ్లింది. మొత్తం 140 జీవాలు మృతి చెందాయి. క్షణాల్లో జరిగిన ఘోరాన్ని చూసి పెంపకందారులైన లండ తిరుపతిరావు తదితరులు కుప్పకూలారు. లబోదిబోమంటూ విలపించారు. మృతి చెందిన జీవాల విలువ రూ. 14లక్షలకుపైగానే ఉంటుందని బాధితులు తెలిపారు.


