‘విపత్తుల నిర్వహణ కీలకం’ | - | Sakshi
Sakshi News home page

‘విపత్తుల నిర్వహణ కీలకం’

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

మిగిలిన 12 మద్యం షాపులకు నోటిఫికేషన్‌

ఎచ్చెర్ల: విపత్తుల నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. శనివారం శివానీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ శ్రీకాకుళం చాప్టర్‌ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ స్టడీ కమ్‌ ట్రైనింగ్‌ ప్రొగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ రాష్ట్రశాఖ చైర్మన్‌ పైడి రామారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ తరఫున ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

టెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రత్యేక కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించా లని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌ లో అధికారులతో ఆయన మాట్లాడారు. పరీక్ష ల కోసం జిల్లా పరిధిలో ఐదు కేంద్రాలను ఏ ర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి అ సౌ కర్యం కలగకూడదని తెలిపారు.

అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం అర్బన్‌: ఐటీఐ పాస్‌ అయిన అభ్య ర్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. శ్రీకాకుళం జిల్లాలో డీజిల్‌ మెకానిక్‌, మో టార్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, డ్రాఫ్ట్‌ మన్‌ సివిల్‌, ఐటీఐ పాస్‌ అయిన అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.అప్రెంటిస్‌షిప్‌ఇండియా.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ లోపు అప్రెంటిస్‌షిప్‌ కోసం, వారి పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలని అప్పలనారాయణ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు ఈనెల 30వ తేదీన సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ కోసం, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, వీటీ అగ్రహారం, విజయనగరంలో హాజరు కావాలని తెలిపారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో మిగిలిన 12 మద్యం దుకాణాల లైసెన్సులకు ప్రభుత్వం మరోమా రు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 19న దరఖాస్తుల స్వీకరణ గడువు అని, 21న లాటరీ ప్రక్రియ జరుగుతుందని జిల్లా ఎకై ్సజ్‌ వర్గాలు పేర్కొన్నాయి

గర్భం దాల్చిన హాస్టల్‌ విద్యార్థిని

టెక్కలి: టెక్కలిలోని ఓ బాలికల వసతి గృహానికి చెందిన విద్యార్థిని గర్భం దాల్చిన విష యం శనివారం బహిర్గతమైంది. కొన్నాళ్ల కిందట సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థిని హాస్ట ల్‌కు చేరుకున్నాక నెలసరి రాకపోవడంతో వార్డెన్‌ ఇంటికి కబురు పంపించారు. వారు యువతిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఓ యువకుడితో వివాహం జరిపించే క్రమంలో ఇరువురికి విభేదాలు రావడంతో ఈ విషయం బహిర్గతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement