● స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కేటాయింపులపై సర్కార్ నిర్ణయం
● జిల్లాలో మొదలైన ‘స్థానిక’ రిజర్వేషన్ల లెక్కలు అంచనాలు
అరసవల్లి: బీసీలపై కూటమి ఒలకబోస్తున్న ప్రే మ నాటకమేనని సుప్రీం సాక్షిగా తేలిపోయింది. దీంతో అత్యవసర క్యాబినెట్ మీటింగ్లో బీసీలకు రానున్న స్థానిక ఎన్నికల్లో రానున్న కేటా యించనున్న సీట్ల ఖరారుపై అంచనాకు వచ్చా రు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆధారంగా వివిధ కేటగిరిల్లో బీసీలకు దక్కనున్న రిజర్వేషన్ కేటాయింపులపై శనివారం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు వివరాల్లోకి వెళితే.. రాష్ట్రం యూనిట్గా బీసీలకు పదవుల విషయంలో పంచాయతీ వార్డు సభ్యుని నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వరకు కేటగిరిల వారీగా రిజర్వేషన్ శాతాలను దక్కే సీట్లను ఖరారు చేయనున్నారు.
పంచాయతీ వార్డులు– 26.73 శాతం, సర్పంచులు–27.95 శాతం, జెడ్పీటీసీలు–24.60 శాతం, జెడ్పీ చైర్పర్సన్లు–23.08 శాతం, ఎంపీటీసీలు–25.55 శాతం, ఎంపీపీలు– 24.60 శాతం బీసీలకు సీట్లు దక్కనున్నట్లుగా ప్రకటించింది. ఈ ప్రకారం ‘స్థానిక’ జిల్లాలో బీసీ లెక్కల ప్రకారం రిజర్వేషన్లు, దక్కనున్న పదవుల స్థానాల పరిస్థితులను పరిశీలిస్తే..


