పచ్చని పొలాల్లో చిచ్చు పెడతారా..? | - | Sakshi
Sakshi News home page

పచ్చని పొలాల్లో చిచ్చు పెడతారా..?

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

జి.సిగడాం: కూటమి ప్రభుత్వం పచ్చని పొలాలను వేదాంత గ్రూపునకు అప్పగించి చిచ్చు పెడుతోందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ విమర్శించారు. జి.జిగడాం మండలంలోని పున్నాం గ్రామంలో వేదాంత మైనింగ్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు తెలియకుండా పొలాల్లో సర్వేలు చేశారని తెలిపారు. వేదాంత కంపెనీకి ఇచ్చి న ఆదేశాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని కోరా రు. ఏటా మూడు పంటలు పండే భూములు వేదాంత గ్రూపునకు ఇవ్వడం సరికాదన్నారు. 150 ఎకరా ల భూమిలో మైనింగ్‌ కోసం రైతులకు తెలియకుండా కంపెనీ సిబ్బంది ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement