ఉద్యోగాల కల్పన.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల కల్పన..

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

ఉద్యోగాల కల్పన.. చంద్రబాబు హయాంలో..

వైఎస్‌ జగన్‌ హయాంలో..

సచివాలయాల ఏర్పాటు ద్వారా ఒకే సారి 7880 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఇందులో అత్యధికులు బీసీలే. జిల్లా వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రతి పీహెచ్‌సీకి అదనంగా ఒక్కో డాక్టర్‌ను నియమించారు. వారంతా దాదాపు వెనకబడిన వర్గాల వారే. వివిధ రకాల హోదాల్లో పీహెచ్‌సీల్లో, 108, 104 వాహనాల్లో కొత్తగా పనిచేసేందుకు కొత్తగా 2199 మందిని నియమించారు. అత్యధికమంది అట్టడుగు వర్గాల వారే. పెండింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీకు చెందిన 780మందికి టీచర్‌ పోస్టులను ఇచ్చారు. 24 మందిని జేఎల్‌గా నియమించారు. అలాగే, 2018 డీఎస్సీ అభ్యర్థులకు ఉన్న న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి, అత్యంత పారదర్శకంగా 300వరకు ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేపట్టారు. వీరిలో బీసీలే అధికం.

చంద్రబాబు హయాంలో 2024–25 డీఎస్సీలో 543 టీచర్‌ పోస్టులు ఇచ్చారు. కోర్టు కేసులు క్లియర్‌ కావడంతో 84 మందికి పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతకు మించి ఒక్క పోస్టు కూడా ఇవ్వ లేదు. ఉద్యోగాలు ఇచ్చామని పబ్లిసిటీ చేసుకోవడం తప్ప నిరుద్యోగుల కలలు సాకారం చేయలేదు. పైగా ఉద్యోగం కల్పించేంతవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement