శరన్నవరాత్రి శోభపాతపట్నం నీలమణి దుర్గమ్మ ఆలయం ఉత్సవాలకు సిద్ధమైంది. 11 నుంచి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. –8లో
ఎన్నాళ్లని మభ్యపెడతారు..
బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ. రిజర్వేషన్లీ కలిపి 50 శాతం దాటకూడదన్న నిబంధన ఉన్నా.. కేవలం కపట నాటకాలతో చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ హయాంలో 56 కుల కార్పొరేషన్ చైర్మన్లు, 76 రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు, 11 మంది మంత్రులు, 4 రాజ్యసభ పదవులు, 9 మంది మేయర్లు, 52 మంది మునిసిపల్ చైర్మన్లు, 76 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవులు బీసీలకు ఇచ్చారు.
– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే
బీసీలకు వెన్నుపోటు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో తెలుగుదేశం పార్టీ డ్రామాలాడుతోంది. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యి కనీసం బీసీల రిజర్వేషన్పై వినతిపత్రం ఇవ్వలేదు. కేంద్రాన్ని ఒప్పించి షెడ్యూల్ 9 లో చేర్చాలన్న బీసీ సంఘాల డిమాండ్ను అమలుచేయలేదు. చెల్లని జీఓలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నారు. – శిష్టు గోపి,
వైఎస్సార్సీపీ పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు
చెల్లని జీఓలు..


