డ్రామా ముగిసింది | - | Sakshi
Sakshi News home page

డ్రామా ముగిసింది

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

మభ్యపెట్టేందుకే.. ●

బీసీ రిజర్వేషన్ల అంశంలో చంద్రబాబు డ్రామా ముగిసింది. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక బయట పెట్టకుండానే రిజర్వేషన్లు పెంచుతూ జీఓలు ఇవ్వడంపై కోర్టు సీరియస్‌గా స్పందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఒరిగిందేమిటో తేలిపోయింది.

– వజ్జ మృత్యుంజయరావు,

మకరాంపురం, కంచిలి మండలం

బీసీలపై కపట ప్రేమ

వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తుంది. ఇచ్చిన పదవులు తక్కువ.. చెప్పుకునే గొప్పలు ఎక్కువ. 34 శాతం రిజర్వేషన్ల వ్యవహారం అంతా జిమ్మిక్కే.. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక బయట పెట్టకుండానే రిజర్వేషన్లు పెంచుతూ జీఓ ఇచ్చారు. – పాగోటి రాజారావు,

వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, నరసన్నపేట

బీసీలకు నిజంగా రాజ్యాధికారం ఇవ్వాలనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌లో చట్టం చేయాలి. అలా కాకుండా తనకు నచ్చినట్లు జీఓలు చేయడం బీసీ వర్గాలను మభ్యపెట్టడమే. ఆ జీఓలు నిరుప యోగమని తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారు.

– పతివాడ గిరీశ్వరరావు, ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ గౌరవ అధ్యక్షుడు

బీసీలను సీఎం మోసం చేశారు

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం చంద్రబాబునాయుడు వెనుకబడిన వర్గాలను మోసం చేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన అసంబద్ధ జీఓలను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో టీడీపీ ప్రభుత్వ వైఖరి బట్టబయలైంది.

– పాతిర్ల రాజశేఖరరెడ్డి, బీసీ సంఘ నాయకుడు, ఇచ్ఛాపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement