జి.సిగడాం: ‘మేమంతా కుటుంబాలతో కలిసిమెలిసి ఉంటున్నాం.. రాజకీయాల కోసం బలికాబోం. చేతులు ఎత్తితే మనస్పర్థలు వస్తాయి.. నేరుగా బ్యాలెట్ ద్వారా ఓట్లు నిర్వహించండి.. లేకపోతే తిరిగి వెళ్లిపోతాం..’ అంటూ జి.సిగడాం మండలం ఆనందపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు తేల్చిచెప్పారు. దీంతో అదే విధంగా ఎన్నిక నిర్వహించి చైర్మన్గా డోల రాంబాబు, వైస్ చైర్మన్గా చిత్తిరి విజయలక్ష్మిలను ఎన్నుకున్నారు. ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐ కొండపల్లి అప్పలసూరి, కోరుకొండ రామకృష్ణారావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


