సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికల్లో అధికార యంత్రాంగం అధికార పక్షానికి కొమ్ముకాసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలో కోరం సభ్యులు ఉన్నప్పటికీ అధికార పక్షం బలపరిచిన అభ్యర్థి ఓడిపోతాడన్న ఉద్దేశంతో గలాటా సృష్టించి ఎన్నిక వాయిదా వేయించారని గుర్తుచేశారు. ఇప్పుడు 80 శాతం మహిళలు ఓటింగ్లో ఉండాలని చెప్పడం ఏకపక్ష ధోరణికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి ఇల్లాకుల శ్రీనివాసరావు ఆరోపించారు. ఏకపక్ష ఎన్నిక విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.


