పోలీసుల సమస్యలపై డయల్‌ యువర్‌ ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీసుల సమస్యలపై డయల్‌ యువర్‌ ఎస్పీ

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా పోలీసు సిబ్బంది ఉద్యోగరీత్యా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ద్వారా తెలియజేసి పరిష్కారం పొందాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పోలీస్‌ గ్రీవెన్సు (డయల్‌ యువర్‌ ఎస్పీ) నిర్వహించారు. పలువురు పోలీసులు తమ లీవులు, సర్వీసు అంశాలు, ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

ఎచ్చెర్ల : ఆల్‌ ఇండియా యూనివర్సిటీ స్థాయి బాక్సింగ్‌ పోటీలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్శిటీ తరఫున ప్రాతినిధ్యం వహించే జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. బాలురు విభాగంలో 20 మంది, బాలికల విభాగంలో ముగ్గురు పాల్గొన్నారు. బాలుర విభాగంలో ఈ నెల 30 నుంచి నవంబర్‌ 6 వరకు నోయిడాలో గల్గోసియా యూనివర్శిటీలో, బాలికల విభాగంలో రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయపూర్‌లో మోహన్‌లాల్‌ సుఖాడియా యూనివర్శిటీలో వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 24 వరకు పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య, అంకెం భాస్కర్‌, ఎం.శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

బాలికపై వృద్ధుడి లైంగిక దాడి

బూర్జ: మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు వరుసకు మనవరాలు అవుతుందని సమాచారం. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చడంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏఆర్‌ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ

శ్రీకాకుళం క్రైమ్‌ : ఇటీవల పదోన్నతి పొంది సాధారణ బదిలీల్లో భాగంగా మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌) విభాగానికి నూతన డీఎస్పీగా నియమితులైన ఎన్‌.వెంకటరమణ ఎచ్చెర్లలోని ఏఆర్‌ విభాగ చాంబరులో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

బీసీలకే అవకాశం కల్పిస్తాం

శ్రీకాకుళం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టులు రిజర్వేషన్‌ పెంపును కాదన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో 34 శాతం కంటే ఎక్కువగా బీసీలకే అవకాశం కల్పిస్తామని తమ నాయకుడు ఇప్పటికే ప్రకటించారని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించిన ఘనత తెలుగుదేశందేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement