వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

పోలాకి: ఈదులవలస గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గ్రామానికి చెందిన తండ్యాల మల్లేసు, దేశిల్లి దాలినాయుడు, పొన్నాపు రమణ, గేదెల శాంతారావులు గ్రామస్తులు, తమ అనుచరులతో కలిసి పార్టీ కండువాలు ధరించారు. శుక్రవారం జరిగిన విద్యాకమిటీ ఎన్నికలను అధికార పార్టీ రాజకీయం చేయటం నచ్చలేదని, అందుకే వారికి వ్యతిరేకంగా పనిచేసి పాఠశాల అభివృద్ధికి దోహదపడే వ్యక్తులను గెలిపించుకున్నామని తెలిపారు. పార్టీలో చేరడంతోనే విజయం తీసుకొచ్చారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కృష్ణదాస్‌ సూచించారు. కార్యక్రమంలో మాజీ మండల పరిషత్‌ సలహాదారు ముద్దాడ భైరాగినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు కె.లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు రావాడ అప్పన్నరాజు, పార్టీ నాయకులు ముద్దాడ శ్రీనివాస్‌, బోర హాటకేశం(బుజ్జి), బొజ్జ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement