భారీగా పేలుడు పదార్థాలు, నగదు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

భారీగా పేలుడు పదార్థాలు, నగదు స్వాధీనం

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

వేంసూరు: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మీదుగా అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను ఖమ్మం జిల్లా వేంసూరు పోలీసులు గురువారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి హైదరాబాద్‌కు భారీగా పేలుడు పదార్థాలు, నగదు తరలిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, వేంసూరు పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనంలో తరలిస్తున్న 200 కిలోల జిలెటిన్‌ స్టిక్స్‌తో పాటు రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే, పట్టుబడినవి అసలు నోట్లా, నకిలీ నోట్లా అనేది తేలాల్సి ఉంది. ఈమేరకు పోలీసులు విచారణ చేపడుతుండగా, వాహనాన్ని శుక్రవారం సాయంత్రం పెనుబల్లిలోని సీఐ కార్యాలయానికి తరలించారు. ఈ విషయమై పూర్తి వివరాలను పోలీసులు శనివారం వెల్లడించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement