శ్రీకాకుళం పాతబస్టాండ్: జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు బదిలీ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఫర్మాన్ అహ్మద్ ఖాన్ 2024 జూలై 26వ తేదీన జిల్లాకు జేసీగా వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఆయనను ప్రస్తుతం ఆర్థిక శాఖ లో ప్రభుత్వ ఉప కార్యదర్శిగా నియమించారు. ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లాలో భూ సేకరణను సమర్థంగా నిర్వహించిన పేరు గడించారు. రాజ కీయ ఒత్తిళ్లకు దూరంగా ఉన్నారు. ఆర్వోఆర్ కేసుల పరిష్కారం, సివిల్ సప్లై విధుల్లో ఆయన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు.


