బీసీలకు బాబు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

బీసీలకు బాబు వెన్నుపోటు

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

బీసీలంటే చులకన: తమ్మినేని

చంద్రబాబు, ఆయన అనుచరులకు బీసీలంటే చులకన భావమని మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బలహీన వర్గాలమైనా బలహీనులం కాదని గతంలోనే నిరూపించామని, వెన్నుపోటు రాజకీయాలపై బీసీలంతా గళం విప్పాలని పిలుపునిచ్చారు.

20 ఏళ్ల పాలనలో అన్యాయం: బూడి

చంద్రబాబు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 ఏళ్లు పాలించినా బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, 2024లోనూ మరోసారి బీసీలను మోసం చేశారని అన్నారు. టీడీపీ బీసీల పార్టీ కాదని, వంచించిన పార్టీ అని ధ్వజమెత్తారు.

సంఘటిత శక్తిగా ఎదగాలి: ధర్మాన కృష్ణదాస్‌

బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు జీఓలు ఇచ్చి మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

బీసీలను చైతన్యపరచాలి: సీదిరి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చట్టసభల్లో 50 శాతానికి పైగా ప్రాతినిధ్యం కల్పించామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని కోరారు.

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ‘వెన్నుపోటు’ రాజకీయాన్ని, బీసీలకు జరిగిన వంచనను ఎండగట్టేందుకు ఈ నెల 16న విశాఖలో నిర్వహించనున్న ‘బీసీ గర్జన’ను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జోన్‌–1 పరిధిలో బీసీ గర్జన సన్నాహక సమావేశాన్ని గురువారం ఎండాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని బీసీ నేతల నుంచి సూచ నలు, సలహాలు స్వీకరించారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాల సమస్యలను తెలుసుకుని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు జరిగిన అన్యా యం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలకు అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని నేతలు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మెంటాడ స్వరూప్‌, బొడ్డేపల్లి పద్మజ, మామిడి శ్రీకాంత్‌, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:

ధర్మాన ప్రసాదరావు

బీసీల పార్టీగా చెప్పుకొనే టీడీపీ.. బీసీలకు చేసింది మోసం, దగా తప్ప మరేమీ లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రభుత్వ భూములను కారుచౌకగా కేటాయిస్తున్నారని, విశాఖలో ఇటీవల 16 హోటళ్లకు ప్రభుత్వ భూములు కేటాయించిన అంశాన్ని ప్రజలకు వివరించాలన్నారు. బీసీలకు విద్య, వైద్యం అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి, బీసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

మేలు కన్నా మోసమే ఎక్కువ: బొత్స

నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బీసీలకు చేసిన మేలు కన్నా మోసమే ఎక్కువని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు చారిత్రాత్మక మేలు చేశారని అన్నారు. 2019లో బీసీ గర్జనలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చేర్చి అమలు చేశామని గుర్తుచేశారు. సర్పంచ్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బీసీ కమిటీలను సమన్వయం చేసుకుని గర్జనను విజయవంతం చేయాలని కోరారు.

హామీలతో మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చాక మోసం

వైఎస్సార్‌సీపీ హయాంలోనే బీసీలకు పెద్దపీట

వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు బొత్స, ధర్మాన

16వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్‌–1 బీసీ గర్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement