13 నుంచి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

13 నుంచి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

మల్లన్న ఆదాయం రూ.1,68,910

టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాలను అందరి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు కోరారు. ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సంబంధించి గురువారం ఆలయ ప్రాంగణంలో వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎంతో వైభవంగా 101 వార్షిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, దేవదాయ శాఖాధి కారి ప్రసాద్‌పట్నాయక్‌, డీఎస్పీ డి.లక్ష్మణరావు, ఆలయ చైర్మన్‌ కోరాడ గోవిందరావు, ఆలయం ఈఓ వి.రాధాకృష్ణ, స్థానిక నాయకులు కె.హరివరప్రసాద్‌, బి.గోవిందరాజులు పాల్గొన్నారు.

గురుకులంలో వంటల పరిశీలన

బూర్జ: కొల్లివలస డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో డీసీఓ వై.యశోదలక్ష్మి గురువారం తనిఖీలు నిర్వహించారు. ముందుగా విద్యార్థుల వసతి గృహాలు, అక్కడ సౌకర్యాలు, భోజన శాల పరిశీలించి అక్కడ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్‌ విద్యార్థులతో మాట్లాడారు. తర్వాత అధ్యాపకులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

టెక్కలి: టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయంలో 128 రోజులకు సంబంధించి భక్తుల నుంచి సుమారు రూ.1,68,910 ఆదాయం వచ్చినట్లు ఈఓ జి.గురునాథ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయ ప్రాంగణంలో హుండీ ఆదా యం లెక్కింపు నిర్వహించారు. అలాగే టెక్కలిలో గల సంతోషిమాత ఆలయంలో చేపట్టిన హుండీ లెక్కింపులో భాగంగా 139 రోజులకు సుమారు రూ.29,616ల ఆదాయం వచ్చినట్లు ఈఓ టీపీ మనస్వి తెలిపారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శక వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ కేవీ మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సామగ్రి, బ్యాలెట్‌ బాక్సుల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు సంబంధించి ప్రింటింగ్‌ ప్రెస్‌ల గుర్తింపు సహా అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలను ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు. మొదటి విడతలో పోలింగ్‌ జరగనున్న పంచాయతీల జాబితాను ఇప్పటికే సరిచూశామని, ఏవైనా స్వల్ప మా ర్పులు ఉంటే తదుపరి 24 గంటల్లోగా తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతామని కలెక్టర్‌ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.

శ్రీముఖలింగం ఆలయ సమీపంలో గొయ్యి ఏర్పాటు

జలుమూరు: శ్రీముఖలింగం ఆలయ సమీపంలో గొయ్యి ఏర్పాటు చేశారు. స్వామితోపాటు ఇతర దేవతా విగ్రహాలకు పూజలు అనంతరం పూలు,పత్రి తదితర పూజా ద్రవ్యాలను పవిత్రంగా ఈ గొయ్యిలో వేసి అనంతరం వాటిని మొక్కలకు వినియోగిస్తామని ఆలయ చైర్మన్‌ శివ ప్రసాద్‌ పాడి గురువారం తెలిపారు. మంగళవారం ‘సాక్షి’లో ‘మహాదేవునికి అపచారం’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి యంత్రాలతో ఆలయ సమీపంలో గొయ్యి ఏర్పాటు చేశారు.

ఆలయ సమీపంలో ఏర్పాటు చేస్తున్న గొయ్యి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement