జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా వివేకానంద | - | Sakshi
Sakshi News home page

జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా వివేకానంద

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

● అద్దెకు దిగుతానని వచ్చి బంగారం దోచుకెళ్లిన యువతి

● జిల్లా కేంద్రంలో ఘటన

శ్రీకాకుళం రూరల్‌ : ఇంటిని అద్దెకు ఇవ్వడానికి పెట్టిన టూ–లెట్‌ బోర్డు ఓ వృద్ధురాలి పాలిట శాపంలా మారింది. ఇంటిలో అద్దెకు దిగుతానని వచ్చిన ఓ యువతి ఇంటి యజమాని కంటిలో కారం కొట్టి బంగారం దోచుకెళ్లిన ఘటన శ్రీకాకుళం నగరంలో గోవిందనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. మూడు రోజుల పాటు మాటలు కలిపి అన్నీ తెలుసుకుని పక్కా ప్లానింగ్‌తో ఈ దోపిడీ జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

కాలనీకి చెందిన ఎడ్ల వరలక్ష్మి తనకున్న అపార్ట్‌మెంట్‌లో పై పోర్షన్‌ అద్దెకు ఇస్తామంటూ టూ–లెట్‌ బోర్డు పెట్టారు. ఆ బోర్డుని చూసి పాతికేళ్ల యువతి మూడు రోజుల కిందట వచ్చి ఇంటిని పరిశీలించింది. తనతో పాటు నలుగురం ఉంటామని చెప్పింది. ఇంటిలో ఎవరూ ఉండర న్న విషయం నిర్ధారించుకున్నాక ప్లాన్‌ ప్రకారం గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటిలోకి వెళ్లి వృద్ధురాలితో మాట కలిపింది. అంతలోనే తన వెంట తెచ్చుకున్న కారంపొడిని తీసి ఒక్కసారిగా కంటిలో కొట్టింది. వృద్ధ మహిళ కేకలు వేసేలోపే మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకుపోయింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోపే పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని చుట్టుపక్కల సీసీ ఫుటేజీలను పరిశీలించారు. రూరల్‌ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : శ్రీకాకుళం ప్రాంతీయ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి (ఆర్‌వీ అండ్‌ ఈవీ)గా సీహెచ్‌ వివేకానంద గురువారం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రం సమీపంలోని గ్రాండ్‌ హోటల్‌ పై అంతస్తులో ఉన్న సంబంధిత కార్యాలయ చాంబర్‌లో ఆయన విధుల్లో చేరారు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఇన్‌చార్జిగా కొనసాగుతున్న విశాఖపట్నం ఓఎస్‌డీ, ఆర్‌వీఈవీ కింజరాపు ప్రభాకర్‌ ఇక విశాఖకే పరి మితం కానున్నారు. ఈ సందర్భంగా వివేకానంద విలేకరులతో మాట్లాడు తూ శాఖాపరంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయవనరులపై పూర్తి దృష్టిసారిస్తానన్నారు. తన పరిధిలో శ్రీకాకుళంతో పాటు విజయనగరం, పార్వతీపురం–మన్యం జల్లాలు ఉన్నాయన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement