భద్రంగా సిక్కోలు ముద్రలు | - | Sakshi
Sakshi News home page

భద్రంగా సిక్కోలు ముద్రలు

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

● ప్రముఖుల పేరిట తపాలా కవర్ల ముద్రణ

● చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలపై స్టాంప్‌లు

శ్రీకాకుళం అర్బన్‌: సిక్కోలు ముద్రలను తపాలా శాఖ భద్రంగా ఉంచింది. మన చరిత్రను, చారిత్రక ఆనవాళ్లను, ప్రముఖులను స్టాంపుల రూపంలో నిక్షిప్తం చేసింది. నేడు తపాలా దినోత్సవం. సిక్కోలును కష్టజీవుల ఇలాకాగా.. ఆధ్యాత్మిక పరిమళా లు వెదజల్లే ప్రాంతంగా.. చారిత్రాక ఘటనలకు వేదికగా నిలిచిన ప్రాంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది పోస్టల్‌ శాఖ.

రూ.25 వేలు చెల్లించాలి

ఏదైనా విశిష్టతలకు సంబంధించిన ప్రత్యేక కవర్‌ విడుదల చేసేందుకు పోస్టల్‌ శాఖకు రూ.25 వేల వరకు చెల్లించాలి. ముందుగా విశిష్టతలను వివరిస్తూ పోస్టల్‌ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఉన్నతాధికారులు పర్యవేక్షణ అనంతరం అర్హతలను బట్టి అనుమతి లభిస్తుందని శ్రీకాకుళం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వి.హరిబాబు వివరించారు. ఆవిష్కరణ సభ పోస్టాఫీస్‌ పరిసరాల్లో నిర్వహిస్తే రూ.12,500 చెల్లిస్తే సరిపోతుందన్నారు. మనకు నచ్చిన ప్రాంతాల్లో నిర్వహించాలంటే మాత్రం రూ.25 వేలు చెల్లించాలని వివరించారు.

శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీకూర్మం, అరసవల్లి దేవాలయాల చిత్రాలను 2013లో స్టాంప్‌ రూపంలో తీసుకొచ్చింది. వాటి విశిష్టతలను ప్రపంచానికి మరోసారి తెలియజెప్పింది.

నేడు

తపాలా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement