‘అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం’ | - | Sakshi
Sakshi News home page

‘అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం’

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు, బాధితులకు త్వరితంగా న్యాయం చేయడమే లక్ష్యంగా.. జిల్లాలో బాండ్ల పరిశీలన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సీఐడీ డీఎస్పీ ఎన్‌.కాళిదాస్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి డిపాజిటర్లు, బాధితు లు, నామినీలు లేదా చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయ సమీపంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కేంద్రం హాల్‌లో ప్రత్యేక పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డిపాజిటర్‌ మరణిస్తే డెత్‌ సర్టిఫికెట్‌, లీగల్‌హెయిర్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరని పేర్కొన్నారు.

పరిశీలన కేంద్రం..

ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌, ఎస్సీ /ఎస్టీ సెల్‌ భవనం, దండి వీధి, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, కలెక్టర్‌ బంగ్లా రోడ్డు, సంతోషిమాత ఆలయ సమీపంలో, శ్రీకాకుళం.

నేటి నుంచే..

అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వ సెలవు దినాల్లో పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. 9, 10 తేదీల్లో లక్ష్మీనర్సుపేట (ఎల్‌ఎన్‌పేట), గంగువారి సిగడాం (జి.సిగడాం), మండలాలకు చెందిన బాధితుల బాండ్లను పరిశీలిస్తారు. మిగిలిన మండలాలకు చెందిన బాధితుల బాండ్ల పరిశీలన తేదీల వివరాలు తర్వాత వెల్లడిస్తారు.

సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు

● ఒరిజినల్‌ బాండ్‌ / నగదు రశీదు / ఇతర సంబంధిత పత్రాలు.

● స్వయంసంతకం చేసిన ఒరిజినల్‌ బాండ్‌ కలర్‌ జిరాక్స్‌–1 ప్రతి.

● ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు ఒరిజినల్‌ చూపించి జిరాక్స్‌ ఇవ్వాలి.

● పాన్‌కార్డు జిరాక్స్‌, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌, ఖాతాదారు పేరు, ఖాతా నంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ కనిపించేలా స్పష్టంగా ఉండాలి.

● ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో ఒకటి, డిపాజిటర్‌ మొబైల్‌ నంబర్‌, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌, ఏజెంట్‌ పేరు, మొబైల్‌ నంబర్‌ ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement