27 మద్యం దుకాణాలకు ముగిసిన లాటరీ | - | Sakshi
Sakshi News home page

27 మద్యం దుకాణాలకు ముగిసిన లాటరీ

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

● దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.3.60 కోట్ల ఆదాయం

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో మిగిలిపోయిన మద్యం దుకాణాల లైసెన్సు దారుల ఎంపికకు సంబంధించి గురువారం లాటరీ ప్రక్రియ ముగిసింది. 27 మద్యం దుకాణాలకు సంబంధించి ఏడాదికి గాను ఆర్‌ఈటీ ఇన్‌స్టాల్‌మెంట్‌ ఫీ(లైసెన్సు ఫీజు) కింద 1/3 పద్ధతిలో రూ.4,68,87,500 రాగా ఆర్‌ఈటీ పర్మిట్‌ రూం ఫీజు కింద రూ. 62,50,000 లు, దరఖాస్తుల ఫీజు కింద రూ. 3.60 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు జిల్లా ఎకై ్సజ్‌ వర్గాలు పేర్కొన్నాయి. 27 షాపులకు మొత్తంగా 347 దరఖాస్తులు ఎన్‌రోల్‌ అవ్వగా 122 దరఖాస్తులు తుదిదశకు అర్హత పొందాయన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో జిల్లా ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌ సుర్జీత్‌సింగ్‌, సూపరింటెండెంట్‌ సీహెచ్‌ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో వంశధార ప్రాజెక్టు అధికారి, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ జోసెఫ్‌ జయదేవి డ్రాకు సంబంధించిన అభ్యర్థుల టోకెన్లు తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశాలతో డ్రా ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు.

జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ తిరుపతినాయుడు మాట్లాడుతూ 39 షాపుల్లో 27 షాపులకు లైసెన్సుదారుల ఎంపిక డ్రా ద్వారా జరిగిందని, మిగిలిన 12 షాపులకు కమీషనర్‌ నుంచి షెడ్యూల్‌ విడుదల అవ్వాల్సి ఉందన్నారు. 27 షాపుల్లో అత్యధికంగా మెండ త్రినాధరావు (కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి) దక్కించుకున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎకై ్సజ్‌ స్టేషన్‌ సీఐ ఎం.శ్రీనివాసరావుతో పాటు పలు స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement