నాగావళి నదిలో వ్యక్తి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

నాగావళి నదిలో వ్యక్తి మృతదేహం

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

నాగావళి నదిలో వ్యక్తి మృతదేహం

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్‌ సమీపంలో నాగావళి నదీ గర్భంలో ర్యాంపుపై గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి మృతదేహం తేలియాడింది. దీనికి సంబంధించి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ–2 బి.హైమావతి వివరా లు వెల్లడించారు. హిరమండలం మండలం చొర్లంగి గ్రామానికి చెందిన వాడవలస కూర్మారావుకు (34) భార్య పావని, 11 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమా రుడున్నారు. ఈయన విశాఖలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కుమార్తె రజస్వల ఫంక్షన్‌ జరిగింది. తనకు నచ్చని బంధువులను కుటుంబసభ్యులు పిలిచారని మనస్థాపం చెందిన కూర్మారావు ఈ నెల 6న ఆమదాలవలస మండలం దూసి సమీపంలో నాగావళిలో దూకేశాడు. గురువారం నదీ గర్భంలో శవమై తేలియాడటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జాలర్ల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురాగా కుటుంబసభ్యులు కూర్మారావుగా గుర్తించా రు. పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించామని ఎస్‌ఐ హైమావతి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement