రైల్వేట్రాక్‌ పక్కన యువతి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

రైల్వేట్రాక్‌ పక్కన యువతి మృతదేహం

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

జి.సిగడాం(పొందూరు): పొందూరు –దూసి గ్రామాల మధ్య పెనుబర్తి రైల్వే ట్రాక్‌ సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. ఆధార్‌ కార్డు ఆధారంగా మృతురాలు అసోం రాష్ట్ర కామ్‌రూప్‌ మెట్రో పారాజ్యోష్‌పూర్‌ జిల్లాకు చెందిన హిమాంశీబోరో (20)గా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న విశాఖ నుంచి అసోంకు బ్యాంకు పరీక్షల నియమిత్తం వెళ్తుండగా కాలుజారి మృతి చెందిందా..ఎవరైనా రైలు నుంచి తోసేశారా? అనే విషయమై రైల్వేపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వేపోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈయనతోపాటు ఎస్‌ఐ రాజేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement