ప్రజాస్వామ్యంలో చీకటి రోజు | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

శ్రీకాకుళం అర్బన్‌ : ఎన్నికల సంఘంలో జరిగిన అంతర్గత కుంభకోణం, సర్‌ ఓటర్ల జాబితాలో ఏకపక్ష నిర్ణయాలు, ఓట్ల అక్రమ మార్పులకు పాల్పడి న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ను అరెస్టు చేయకుండా కాలయాపన చేయడం భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో ఇండియా మిత్రపక్ష పార్టీలు ఓట్‌ చోరీకి నిరసనగా శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద గురువారం భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు డి.గోవింద్‌, తాండ్ర ప్రకాష్‌, బైబిల్‌ కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, గోవర్దన్‌రావు, ఆదినారాయణమూర్తి, చందు, కృష్ణవేణి, సంతోష్‌, డాక్టర్‌ దువ్వాడ జీవితేశ్వరరావు, కిల్లి రామ్మోహన్‌రావు, పేడాడ పరమేశ్వరరావు, రెల్ల సురేష్‌, అంబటి కృష్ణారావు, మంత్రి నరసింహమూర్తి, డి.గోవింద మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement