ఘనంగా మహాలింగార్చన | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మహాలింగార్చన

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

ఘనంగా మహాలింగార్చన కొత్తమ్మ తల్లి జాతరకు ప్రత్యేక బస్సులు ఫ్లైఓవర్‌ స్లాబ్‌ పెచ్చులూడి వ్యక్తికి గాయాలు కాశీబుగ్గలో ఆర్‌ఓబీ ప్రారంభం వృద్ధుడు ఆత్మహత్య

అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా గురువారం ఉదయం అనివెట్టి మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇప్పిలి సాందీప్‌ శర్మ ఆధ్వర్యంలో శివపంచాయతన సహిత మహాలింగార్చన శాస్త్రోక్తంగా జరగగా..స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఆలయ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం అర్బన్‌ : కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి అమ్మవారి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్‌.అప్పలనారాయణ గురువారం తెలిపా రు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే అమ్మవారి జాతరకు 15 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం–1, 2వ డిపోల నుంచి టెక్కలికి 6 బస్సులు, పలా స డిపో నుంచి పూండి– కొత్తపేట –కోటబొమ్మాళికి 3 బస్సులు, టెక్కలి డిపో నుంచి బోరుభద్ర మీదుగా కోటబొమ్మాళికి 3 బస్సులు, టెక్కలి డిపో నుంచి పిన్నింటిపేటకి 3 బస్సులు నడుపుతామని వివరించారు. ప్రత్యేక బస్సుల్లోనూ ‘సీ్త్ర శక్తి పథకం వర్తిస్తుందని తెలిపారు.

జలుమూరు: పల్లిపేట–పాతపట్నం నేషనల్‌ హైవే(326ఏ)లో తిలారు జంక్షన్‌ వద్ద గురువా రం మధ్యాహ్నం ఫ్లైఓవర్‌ స్లాబ్‌ పెచ్చులూడి విరిగిపడటంతో చిన్నదూగాం గ్రామానికి చెందిన గొండు రామారావుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి బాధితుడిని నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. బస్సు, ఆటోల కోసం ఈ ప్రాంతంలో జనాలు నిత్యం వేచి ఉంటారు. అయితే గోడలు, స్లాబ్‌ పైకప్పు బీటలు వారి ప్రమాదకరంగా మారాయి. తరచూ పెచ్చులు ఊడిపడటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నా రు. అధికారులు స్పందించి పటిష్టంగా నిర్మాణాలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

కాశీబుగ్గ: రానున్న రెండేళ్లలో కాశీబుగ్గ నుంచి తాళ్లభద్ర మీదుగా వెళ్లే రైలు మార్గంపై మరో ఆర్‌వోబీ (రైలు ఓవర్‌ బ్రిడ్జి) నిర్మిస్తామని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ప్రకటించా రు. గురువారం కాశీబుగ్గ ఆర్‌వోబీ ప్రారంభంతోపాటు అమృత్‌ 2.0, సుడా అభివృద్ధి పనుల కు మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కాశీబుగ్గ కేటీరోడ్డు కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పోలవరం ఎలా పలు అవరోధాల ను అధిగమించిందో, జంట పట్టణాలకు ఈ ఫ్‌లైఓవర్‌ అనేక అడ్డంకులను ఎదుర్కొందన్నారు. పలాస నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు.

పలాసకు జిల్లా హోదా అవసరం లేదు..

పలాసకు జిల్లా హోదా అవసరం లేదని వ్యవసాయమంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ కొందరు అలవికాని డిమాండ్లతో నినాదాలు చేయడం సరికాదన్నారు. దసరా నాటికి ఫ్‌లైఓవర్‌పై రాకపోకలు ప్రారంభమవుతాయ ని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, ఆర్‌డీఓ అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే జి.శ్యామసుందర శివాజీ పాల్గొన్నారు.

జి.సిగడాం (పొందూరు): నందివాడ గ్రామానికి చెందిన ముల్లు సత్యం(70) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యం కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 7వ తేదీ రాత్రి కడుపు నొప్పి రావడంతో కోడలు సుశీల దగ్గరలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యున్ని తీసుకురావడానికి వెళ్లింది. ఇంతలోనే సత్యం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో తాపీమేసీ్త్రగా పని చేస్తున్న సూర్యారావు గ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement