శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా సెపక్తక్రా క్రీడకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నందుకు గర్వకారణంగా ఉందని సెపక్తక్రా అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి అన్నారు. దశాబ్దంన్నర కాలంగా జిల్లా క్రీడాకారులు సాధిస్తున్న ప్రగ తి, ఫలితాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నా యని చెప్పారు. జిల్లా సెపక్తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానం వేదిక గా జిల్లా సీనియర్స్ సెపక్తక్రా సీనియర్స్ పురుషు లు, మహిళల జట్ల ఎంపికలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. మెరుగైన ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరిని కోనసీమ జిల్లా అమ లాపురం వేదికగా ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న 36వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ సెపక్తక్రా చాంపియన్షిప్–2026 పోటీలకు పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ గత రెండు సీజన్లలో జిల్లా మహిళల జట్లు విజేతగా నిలుస్తూ బంగారు పతకా లు సాధిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తు.. ఈ ఏడాది కూడా విజేతగా నిలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా సెపక్తక్రా అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ జి.అర్జున్రావురెడ్డి, ఉపాధ్యక్షులు పైడి శ్రీనివాసరావు, ట్రాఫిక్జామ్ శ్రీనివాస్, బి.సోములు, జి.కొర్లయ్య, పద్మావతి పాల్గొన్నారు.


