పలాస రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పలాస రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

పలాస రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

కాశీబుగ్గ: పలాస రైల్వే స్టేషన్‌, పరిసర ప్రాంతాల్లో విశాఖపట్నం డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) లలిత్‌ బోహ్రా గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌, రైల్వే కాలనీ, రైల్వే ఆసుపత్రి, ఆర్‌పీఎఫ్‌ బ్యారక్‌, రన్నింగ్‌ రూమ్‌ తో పాటు లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ నంబర్‌–362ను తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, ప్రయాణికుల సౌకర్యాలు, సిబ్బంది, వసతులు భద్రతా అంశాలను పరిశీలించారు. సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందే లా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీలో కమర్షియల్‌, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement