జిల్లా మాజీ సైనికుల సమాఖ్యను స్థాపించిన పి.ఈశ్వరరావు భారతీయ వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా పనిచేశారు. 1984లో ఐఏఎఫ్లో పైలట్ ఆఫీసర్గా చేరిన ఈయన ఫీల్డ్ యూనిట్లలో ఢిల్లీ ప్రాంతానికి చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్గా, ఈశాన్య ప్రాంతంలో సు–30 ఎయిర్ బేస్కు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సేవలందించారు. ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ ఆపరేషన్ల సమయంలో మూడు ఎయిర్ డిఫెన్షనల్ ఆపరేషనల్ యూనిట్లకు కమాండ్గా వ్యవహరించారు. అలస్కా, అమెరికా, భారతదేశంలో జరిగిన మొదటి ఇండో–ఫ్రెంచ్ అంతర్జాతీయ సంయుక్త వైమానిక విన్యాసంలో పాల్గొన్నారు.


