జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘంలో చురుగ్గా పాల్గొంటున్న డాక్టర్ బొంతు ఈశ్వరప్రసాద్ 1985లో భారత వైమానిక దళంలో మెడికల్ అసిస్టెంట్గా చేరారు. ఆపరేషన్ రెడ్ అలర్ట్ సమయంలో పాకిస్తాన్ సరిహద్దులో ఎడారి ప్రాంతాల్లో విధులు నిర్వహించి సైనికులకు వైద్య సేవలు అందించారు. తీవ్రంగా గాయపడిన సైనికులను హెలికాప్టర్ల ద్వారా ప్రధాన సైనిక ఆస్పత్రులకు తరలించడంలో కీలకపాత్ర పోషించారు. గోరఖ్పూర్ మిలిటరీ ఆసుపత్రిలో పనిచేస్తూ భారత సైనికులతో పాటు నేపాల్ ఆర్మీ సిబ్బందికి కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో చికిత్స అందించారు.


