సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లాలో మద్యం వ్యాపారం సిండికేట్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో మందుబాబులు దోపిడీకి గురవుతున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్ శాఖ ముడుపుల మత్తులో తూగడంతో అక్రమ వ్యాపారం అప్రతిహితంగా సాగుతోంది. అక్రమాలను అరికట్టాల్సిన రక్షకులే.. భక్షకులుగా మారడంతో శ్రీకాకుళం జిల్లాలో మద్యం వ్యాపారం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నిబంధనలను తుంగలోకి తొక్కి, ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపట్టి, ఇష్టారీతిన బెల్ట్‌షాపులు నడుపుతూ ఎకై ్సజ్ అధికారులు తమ గుప్పెట్లో వ్యక్తులుగా సిండికేట్లు చూపిస్తున్నారు. ఒకవైపు సిండికేట్లు నుంచి నెల వారీ ముడుపులు, మరోవైపు అక్రమాలకు గేట్లెత్తి, ఎంఆర్పీకి మించి అమ్మాలని ఒత్తిళ్లు, అమ్మకాలు పెంచేందుకు టార్గెట్లు పెట్టడంతో మద్యం అక్రమ బాగోతం బ్రేకుల్లేని వాహనంలా ముందుకు సాగిపోతోంది.
విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు..
ప్రతి ప్రధాన వైన్‌షాపు పరిధిలో వందల కొద్దీ బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయి. కిరాణా కొట్టు, టీ బంకు, ఆఖరికి పాన్ షాపుల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. బెల్ట్‌షాపుల ఏర్పాటుకు ఎకై ్సజ్ అధికారులే స్వయంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాంతర మద్యం సామ్రాజ్యం నడవడానికి వెనక భారీ ఎత్తున ‘మూమూళ్ల’ పంపిణీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు నెలవారీగా భారీ మొత్తంలో ముడుపులు అందుతుండటం వల్లే ఎమ్మార్పీకి మించి విక్రయాలు, బెల్ట్‌షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నట్టు రుజువవు తోంది.
ప్రజారోగ్యం గాలికి..
ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల కంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, ఎకై ్సజ్ శాఖకు టార్గెట్ల్ రీచ్ అవ్వడమే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విక్రయాలు ఎంత పెరిగితే, కమీషన్లు అంతగా పెరుగుతాయనే వ్యాపార సూత్రాన్ని ఇక్కడ పక్కాగా అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార పోటీ దృష్ట్యా ఎంఆర్పీకి మించి కొందరు వ్యాపారులు విక్రయించకపోవడంతో వారిపై కూడా సిండికేట్ చెప్పినట్టు నడుచుకోవాలని ఒత్తిళ్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు డబ్బులు తినండి.. మాకు కొంత పెట్టండి అన్నట్టు ప్రధాన వైన్‌షాపుల యజమానులను ప్రోత్సహించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రధాన వైన్‌షాపుల నుంచి బెల్ట్‌షాపులకు మద్యం నేరుగా పంపిణీ అవుతోంది. ఇంటింటికి పంపిణీ చేసినట్టు మద్యం షాపులే బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తున్నాయి. ఇదంతా ఎకై ్సజ్ శాఖ కనుసన్నల్లోనే నడుస్తోంది. ఏ షాపు పరిధిలో బెల్ట్‌షాపులు ఆ షాపునకు చెందిన మద్యమే తెచ్చుకోవాలని, బయట నుంచి తీసుకొచ్చి అమ్మితే చర్యలు ఉంటాయని పరోక్షంగా బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో సాగుతున్న ఈ నయా మద్యం దందాకు అడ్డూఅదుపూలేకుండా పోతోంది. సందట్లో సడేమియాగా కల్తీ మద్యం కూడా సరఫరా అవుతోంది. ఇప్పటికే ఈ విషయం పలుచోట్ల వెలుగు చూసింది. ఇచ్ఛాపురం, పలాస దగ్గరి నుంచి ఆమదాలవలస, ఎచ్చెర్ల వరకు కల్తీ దందా నడుస్తోంది. ఈ మొత్తం దందా ఎలా సాగుతోంది? జిల్లాలో సిండికేట్‌పై పెత్తనం ఎవరిది? సూత్రధారులు ఎవరు? అధికారుల్లో ఎవరి పాత్ర ఎంత? నెలవారీగా ఎవరికెంత ముడుపులు అందుతున్నాయి? నేతలకు ముడుతున్నదెంత? అన్న వివరాలను మరో కథనంలో స్పృశిద్దాం.
అమలుకాని ఎంఆర్పీ..
ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట విక్రయ ధర(ఎంఆర్పీ) జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ప్రతి క్వార్టర్ బాటిల్‌పైనా రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. లీజు షాపు దగ్గరి నుంచి బెల్ట్‌షాపు వరకు దోపిడీ జరుగుతోంది. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు దందా సాగుతోంది. అక్రమ వసూళ్లను అడ్డుకోవాల్సిన ఎకై ్సజ్ సిబ్బంది, సిండికేట్లకు వత్తాసు పలుకుతూ దోపిడీని మరింత ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో ఎంఆర్పీ కంటే అధికంగా
విక్రయాలు
మందుబాబుల జేబులకు చిల్లు
ఎకై ్సజ్ అండతో దోపిడీకి పచ్చజెండా
బెల్ట్‌షాపులకు డైరెక్షన్


