అచ్చెన్నవి పచ్చి అబద్ధాలు | - | Sakshi
Sakshi News home page

అచ్చెన్నవి పచ్చి అబద్ధాలు

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

● బీసీలకు నిజమైన సాధికారత

కల్పించింది వైఎస్సార్‌ సీపీనే

● అంకెలు చూసైనా నిజాలు ఒప్పుకోవాలి

● విలేకరులతో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారితపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు లభించిన పదవులు లెక్కలను చూస్తే ఎవరికి చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బీసీలకు లభించిన పదవుల వివరాలను అంకెలతో సహా బుధవారం మబగాంలో విలేకరులకు వెల్లడించారు. వైఎస్సార్‌ సీపీ పాలనలో రాష్ట్ర మంత్రి వర్గంలోని 25 మంది మంత్రుల్లో 11 మందికి కేబినేట్‌ హోదాతో మంత్రి పదవులు లభించాయని చెప్పారు. వీరిలో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత వైఎస్సార్‌ సీపీకే దక్కిందన్నారు. 13 జిల్లా పరిషత్‌ అధ్యక్షుల్లో ఏడు జెడ్పీ చైర్మన్‌ పదవులు బీసీలకే కట్టబెట్టారన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయరు పదవుల్లో 9 మందికి బీసీలకే ఇచ్చారని గుర్తు చేశారు. 86 మున్సిపాల్టీల్లో 45 స్థానాలకు పైగా బీసీ అభ్యర్థులకు చైర్మన్లుగా అవకాశం వచ్చిందన్నారు. ఇక రాజ్యసభ స్థానాల్లో ఏకంగా నలుగురు బీసీ వ్యక్తులను నియమించి ఎగువ సభకు పంపినట్లు తెలిపారు. నామినేటెడ్‌ కార్పొరేషన్‌ పదవుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సుప్రీం, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న చట్టబద్ధమైన నిబంధనల వల్లే నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందే తప్ప బీసీల పదవులు తగ్గించాలని కాదని స్పష్టం చేశారు. చట్టపరమైన ఇబ్బందులను ఎదర్కొంటూనే ప్రతి నామినేటెడ్‌ రాజకీయ పదవుల్లో 50 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశాలు కల్పించిన ఏకై క నాయకుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అని కృష్ణదాస్‌ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, సుప్రీం కోర్టు పరిధిలోని అంశాలను సాకుగా చూపిస్తూ వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికై నా అసత్య ప్రచారాలు మానుకుని, బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement