మద్యం దుకాణాలు మాకొద్దు | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలు మాకొద్దు

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

● ముక్తకంఠంతో నినదించిన మూడు గ్రామాల ప్రజలు

కాశీబుగ్గ :

తమ పంచాయతీ పరిధిలో ఇకపై మద్యం దుకాణాలు నడపరాదంటూ పలాస మండలం గురుదాసుపురం పంచాయతీకి చెందిన గురుదాసుపురం, కొబ్బరిచెట్టూరు, చిన్నమామిడిమెట్టు గ్రామస్తులు ముక్తకంఠంతో నినదించారు. గ్రామ కూడళ్ల వద్ద బెల్ట్‌ షాపులు, ప్రభుత్వ మద్యం దుకాణాలను ఇకపై నడపడానికి వీల్లేందంటూ ఆయా గ్రామాలకు చెందిన యువత, మహిళలు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కాశీబుగ్గ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మల్లికార్జునరావుకు వినతిపత్రం అందజేశారు.

భయాందోళనలతో బడికి..

చిన్న గురుదాసుపురం గ్రామానికి సుమారు కిలోమీటర్‌ దూరంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు ప్రధాన రహదారి మీదుగా సుమారు ఎనిమిది ఊళ్లకు చెందిన విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు భయాందోళనలకు లోనవుతున్నారు. అధికారులు స్పందించి చిన్న గురుదాసుపురం జంక్షన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి కే.తేజేశ్వరరావు, జి.దేవదాస్‌, పాతిని జానకిరావు, జినగ శ్రీధర్‌, డొక్కరి మాధవరావు, జె.వినోద్‌, జె.సుధీర్‌, ఎం.వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

నేడు మద్యం దుకాణాల లాటరీ

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో మిగిలిన 39 మద్యం షాపులకు ఏడాదిపాటు లైసెన్సు మంజూరు కోసం గురువారం లాటరీ తీస్తామని జిల్లా ఎౖకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ తిరుపతినాయుడు తెలిపారు. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మార్గంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సమక్షంలో లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఉదయం 8 గంటల్లోగా చేరుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement