సర్కారు డప్పు
మోసం కాదా..
మాకు 5000 కాదు రూ.10000 జీతం ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. గత ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సేవలను అందించాం. మమ్మల్ని గుర్తించకుండా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రచారం కోసం ఇన్ఫ్లూయెర్స్కు డబ్బులు చెల్లించడం బాధాకరం. – ఢిల్లీ ప్రధాన్, మాజీ వలంటీర్, మెళియాపుట్టి
ఎగతాళి చేశారు..
అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని చెప్పారు. తర్వాత మాట తప్పారు. మేం నేరుగా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తే ఎగతాళి చేశారు. ఇప్పుడు డబ్బులు పంచి సోషల్ మీడియా ప్రతినిధులకు ఎలా ప్రభుత్వ ధనాన్ని పంచిపెడతారు?
– పోళ్ల అనిత, మాజీ వలంటీర్, శ్రీకాకుళం రూరల్


