రైతులకు అన్యాయం జరగకూడదు | - | Sakshi
Sakshi News home page

రైతులకు అన్యాయం జరగకూడదు

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

● జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

● జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

ఆమదాలవలస రూరల్‌: భూ రీసర్వేకు సంబంధించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని కలివరం గ్రామంలో పంట పొలాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసర్వేకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సాగునీటి సమస్య, ఎరువుల కొరత తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. నారాయణపురం ఎడమ కాలువ ద్వారా తగిన సాగునీరు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు మొరపెట్టుకున్నారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్‌ బి.సత్యం, వ్యవసాయశాఖ అధికారి మెట్ట మోహనరావు, మండల సర్వేయర్‌ బొడ్డేపల్లి గోపి, మండల రీసర్వే ఉప తహసీల్దార్‌ పప్పల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement