అరసవల్లి: పీఎం సూర్యఘర్ పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు స్థానిక విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద బుధవారం సేవ సేతు క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ విద్యుత్ కనెక్షన్ వినియోగిస్తే.. విద్యుత్ వినియోగ బిల్లు జీరో వస్తుందన్నారు. అందుకే వినియోగదారులు సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని సూచించారు. సర్కిల్ ఎస్ఈ జీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ సేవసేతు ప్రమోషన్లో భాగంగా జిల్లాలో గత నెల 17 నుంచి అన్ని విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు నిర్వహిస్తున్నామన్నారు. వీటిని ఈనెల 17 వరకు అందుబాటులో ఉంచుతామని.. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కోరారు. అంతకుముందు సేవసేతు ప్రమోషన్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ బయ్యన్నాయుడు, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు, విష్ణుమూర్తి, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, ఏఈలు సురేష్కుమార్, జయరాం, కమల్హాసన్ తదితరులు పాల్గొన్నారు.


